Wednesday, May 1, 2024

బాలిక అవయవదానం.. ఆరుగురికి ప్రాణదానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ చెందిన ఒక 15 ఏళ్ల బాలిక తన అవయవాలతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణదానం చేసింది. ఆ బాలిక గుండె మరణం అంచున ఉన్న మరో మహిళకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ నెల 15వ తేదీన బసు అనే బాలిక చండీగఢ్‌లో రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలతో పిజిఐఎంఇఆర్ ఆసుపత్రిలో చేరింది. ఆ బాలికను బ్రెయిన్ డెడ్‌గా ఆగస్టు 20న నిర్ధారించిన వైద్యులు అవయవాల పరిరక్షణ కోసం ఆమెను వెంటిలేటర్‌లో ఉంచారు. ఆసుపత్రికి చెందిన అవయవదాన సమన్వయకర్త సూచన మేరకు ఆ బాలిక తండ్రి, దినసరి కూలీ అయిన అజో మాంజి తన కుమార్తె అవయవాలన్నిటినీ దానం చేయడానికి సంసిద్ధత తెలిపారు. దీంతో ఆ బాలిక గుండె లభ్యతపై నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్(నోట్టో) ఆగస్టు 21న అలర్ట్ జారీచేసింది. కాగా..తీవ్ర గుండె వ్యాధితో బాధపడుతూ గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న బీహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన లక్ష్మీదేవి అనే 32 ఏళ్ల మహిళ ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి చెందిన అటల్ బిహారీ వాజపేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అప్పటికే అడ్మిట్ అయి ఉన్నారు. ఆ బాలిక గుండెను ఆమెకు అమర్చాలని డాక్టర్లు నిర్ణయించారు. వెంటనే ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి, ఎయిమ్స్‌కు చెందిన కార్డియాక్ సర్జన్లు చండీగఢ్ చేరుకుని పిజిఐఎంఇఆర్ ఆస్పత్రిలో ఉన్న ఆ బ్రెయిన్ డెడ్ బాలిక నుంచి గుండెను వెలికితీశారు? ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా రెండు గంటల్లో ఢిల్లీ చేరుకుని వెంటనే లక్ష్మీదేవికి ఆ గుండెను అమర్చారు. న్యూఢిల్లీలోని ఒక కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి చేయడం ఇదే మొదటిసారని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

Organs of Brain dead Girl gives life to 6 in Chandigarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News