Tuesday, June 11, 2024

వరుస చిత్రాలతో బిజీబిజీగా…

- Advertisement -
- Advertisement -

Rakul preet singh Busy with series of pictures

బాలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కరోనా క్లిష్ట సమయంలో కూడా ఎనిమిది చిత్రాలు సైన్ చేసిన సుందరి రకుల్. డ్రగ్స్ ఆరోపణలు, వివాదాలు వంటివి చుట్టుముట్టినా… అన్నింటినీ తట్టుకొని నిలబడింది. బాలీవుడ్‌లో సినిమా ఆఫర్లతో పాటు బాయ్ ఫ్రెండ్‌ని కూడా పొందింది. అదీ కూడా కరోనా కాలంలోనే. లాక్‌డౌన్ తర్వాత ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఇంకో ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు బాలీవుడ్‌లో ఆమె క్రేజ్, రేంజ్. ఆమె నటిస్తున్న సినిమాల్లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి పెద్ద హీరోలవే కావడం మరో విశేషం. ఇక ఆగిపోయింది అనుకున్న మరో భారీ చిత్రం ఇప్పుడు మళ్ళీ ఆమె ఖాతాలో పడింది. శంకర్ మూడేళ్ళ క్రితం మొదలు పెట్టి కరోనా కాలంలో పక్కకి పెట్టిన ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) తాజాగా మొదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తోంది. సిద్ధార్థ్, రకుల్ కూడా నటిస్తున్నారు. అయితే రకుల్ పై ఇంతకుముందు పెద్దగా సీన్లు తీయలేదు. ఆమెని మార్చి మరో హీరోయిన్‌ని తీసుకునే అవకాశం ఉన్నా శంకర్ ఆ పని చేయలేదు. కాబట్టి రకుల్ ‘ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News