Wednesday, May 15, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

 Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 69,012మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వరకు 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 300 రూపాయల దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 29,195 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.59కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News