Wednesday, May 15, 2024

హైవేపై రూ 12 కోట్ల మొబైల్స్ దోపిడి

- Advertisement -
- Advertisement -

Rs 12 crore mobiles looted on the highway

24 గంటలలో ఇండోర్‌లో స్వాధీనం

సాగర్ (మధ్యప్రదేశ్) : నలుగురు దోపిడి దొంగలు రూ 12 కోట్లు విలువచేసే మొబైల్ ఫోన్లను సినీ ఫక్కిలో సంచార శకటం నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జాతీయ రహదారి నెంబరు 44పై మహారాజ్‌పూర్ గ్రామం వద్ద జరిగింది. అయితే వెంటనే స్పందించిన పోలీసులు పెద్ద ఎత్తున జరిపిన గాలింపు చర్యల ఫలితంగా 24 గంటల్లోనే లూఠీ అయిన ఫోన్లు ఇండోర్ వద్ద మరో ట్రక్కులో పట్టుకున్నారు. సాగర్ ఎస్‌పి తరుణ్ నాయక్ ఈ ఘటన వివరాలు తెలిపారు. మొబైల్ ఫోన్లతో ట్రక్కు హర్యానాలోని గురేగావ్‌కు మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించారు. వేరే ట్రక్కులో ఈ సెల్‌ఫోన్లతో ఉడాయించారు. వీరి కదలికలపై పలు విధాలుగా కన్నేసిన పోలీసు బృందాలు 400 కిలోమీటర్ల దూరంలోని ఇండోర్ వద్ద ట్రక్కును నిలిపివేసి , సెల్‌ఫోన్లను స్వాధీనపర్చుకున్నారు. అయితే దోపిడి దొంగలు ఫరారయ్యారు. వీరి కోసం గాలిస్తున్నారు. సెల్‌ఫోన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రక్కులో హర్యానాకు వెళ్లుతుండగా దోపిడి జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News