Tuesday, April 30, 2024

వర్ధన్నపేట గిరిజన బాలికల ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి సీరియస్

- Advertisement -
- Advertisement -

Food poisoning in Wardhannapet tribal women's hostel

బాధ్యులను సస్పెండ్ చేసిన సత్యవతి రాథోడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన భాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపించిన మంత్రి విద్యార్థులకు భోజనం అందించే క్రమంలో నిర్లక్షంగా వ్యవహరించిన గురుకులం వార్డెన్ ఒ. జ్యోతి, కుక్ వి. వెంకట్రామ్, కాంట్రాక్టర్ ఐలయ్యను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రాష్ట్రంలో ని గిరిజన గురుకులాల్లో విద్యార్థుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు.

గురుకులాల్లో నిరంతరం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు అందించే త్రాగునీరు, భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల యోగక్షేమాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మంత్రి వారికి ప్రత్యేక వైద్య చికిత్స అందించడంతో పాటు అవసరమైతే హైదరాబాద్‌కు తరటించాల్సిందిగా అధికారులకు సూచించారు. గిరిజన గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటి నుండి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వైద్య అధికారులను, గురుకుల అధికారులు, జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రజా ప్రతినిధులను మంత్రి అప్పమత్తం చేశారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, వారికి నిరంతర వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News