Friday, September 12, 2025

డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో చేరిన సీనియర్ నటి

- Advertisement -
- Advertisement -

 

actress Jaya Kumari

చెన్నై:   సినీ రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన జయకుమారి ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. 70 ఏళ్ల జయకుమారికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు డబ్బు లేకపోవడంతో ఆమె చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చేరారు. జయకుమారి చెన్నైలోని వేలచ్చేరి ప్రాంతంలో నివసిస్తున్నారు. తమిళ సినిమా ‘నాడోడి’ ద్వారా ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్ టి రామారావు, కాంతారావు వంటి నటులతో కూడా నటించారు. తన కెరీర్ బాగున్న కాలంలోనే ఆమె అబ్దుల్లా అనే వ్యక్తిని వివాహమాడి సినీ రంగానికి దూరం అయ్యారు. భర్త కొంత కాలం క్రితమే చనిపోవడంతో ఆమె కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటన, డ్యాన్స్ తో భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చెన్నై ప్రభుత్వాసుపత్రిలో జయకుమారి చికిత్స పొందుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఎవరైనా ఆర్థికంగా ఆదుకుంటారా? అన్న దయనీయ స్థితిలో ఆమె ఇప్పుడున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News