Wednesday, July 30, 2025

భాగ్యలక్ష్మిని అభినందించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud congratulating athletic Bhagyalakshmi

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో క్రీడాకారులకు తగు ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆథ్లెటిక్ క్రీడాకారిణి భాగ్యలక్ష్మిఅండర్ 20 విభాగంలో అఖిల భారత విశ్వవిద్యాలయాల పోటీల్లో 800 మీటర్ల, 1500 మీటర్ల లలో గోల్డ్ మెడల్ సాధించింది. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆమె కలిసింది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మిని మంత్రి అభినందించి, సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కోచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News