Monday, May 20, 2024

ఏ2 గేదె పాల ధరను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తమ ఏ2 గేదె పాల ధరలను 500 మిల్లీ లీటర్ల ప్యాక్‌కు 2 రూపాయలకు పెంచినట్లు వెల్లడించింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఈ పెంచిన ధరలతో అర లీటర్‌ ప్యాకెట్‌ ధర 50 రూపాయలకు చేరుతుంది. ఆవు పాల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఏ2 గేదె పాలను ప్రీమియం నాణ్యతతో సేకరించడంతో నాణ్యతకు పూర్తి హామీని అందిస్తుంది. ముడి గేదె పాల ధరలు గత ఆరు నెలల కాలంలో 12%కు పైగా కంపెనీకి పెరిగాయి. ఈ పెంచిన ధరలతో ఈ వ్యయం 5%కు పరిమితం అవుతుంది. ఈ సీజన్‌లో దాదాపుగా అన్ని బ్రాండ్లూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ముడి పాల ధరలు ఊహించిన రీతిలో సాధారణతకు రావడం లేదు. సిద్స్‌ ఫార్మ్‌ యొక్క నాణ్యతా ప్రక్రియల కారణంగా యాంటీబయాటిక్స్‌ పాలు అనే భరోసానూ అందిస్తుంది.

పాల ధరల పెంపు గురించి సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్ధాపకులు డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘బంధాలు, అనుభవాల సమ్మేళనం సిద్స్‌ ఫార్మ్‌. మా బ్రాండ్‌ పట్ల వినియోగదారుల నమ్మకాన్ని గౌరవిస్తున్నాము. మా వినియోగదారులకు 100% స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు అందిస్తామనే భరోసాను అందిస్తున్నాము. మా వినియోగదారులకు వీలైనంతగా భారం కలిగించకుండానే నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని ప్రయత్నించినప్పటికీ, అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయాల కారణంగా తప్పనిసరి పరిస్థితులలో ధరలను పెంచడం జరిగింది’’ అని అన్నారు. ఏ2 బఫెలో మిల్క్‌లో ఏ2 బీటీ కెసిన్‌ ప్రోటీన్‌ ఉంటుంది. సిద్స్‌ ఫార్మ్‌ ఏ2 గేదె పాలలో మరింత అధికంగా ప్రొటీన్‌, ఫ్యాట్‌, పోషకాలు ఉంటాయి.

SID’s Farm Hike A2 Buffalo Milk Price

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News