Sunday, June 9, 2024

స్టార్ హీరోల సినిమా అవకాశాల కోసం…

- Advertisement -
- Advertisement -

Keerthi suresh Glamor show

 

టాప్ పొజిషన్‌పై దృష్టిపెట్టి ఆ దిశగా మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న కీర్తికి.. ఈ ఏడాది లక్ మారినట్లు కనిపించింది. ‘సర్కార్ వారి పాట’లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కినప్పుడు కీర్తి సురేష్ టాప్ హీరోయిన్‌గా ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లకు నిద్రపట్టకుండా చేస్తుందనుకున్నారు. కానీ ఆ సినిమా పర్వాలేదనిపించింది. దీంతో ఆమెకి ఇతర పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు ఇప్పటి వరకు రాలేదు. కమర్షియల్ సినిమాల్లో అవకాశాల కోసమే ఆమె ఇటీవల గ్లామర్ షో చేస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోషూట్‌లతో కిరాక్ పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆమె చిరంజీవితో నటిస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో చెల్లెలు పాత్ర పోషిస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎలాగూ ఉన్నాయి. కానీ ఇతర పెద్ద హీరోల సరసన నటించాలన్న ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News