Tuesday, May 7, 2024

3 రైల్వేస్టేషన్లకు రూ 10వేలకోట్లు

- Advertisement -
- Advertisement -

Rs 10,000 crore expenditure approved for 3 railway stations

కేంద్ర మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ : అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లను మరింత తీర్చిదిద్దే పనులకు రూ 10,000 కోట్ల వ్యయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకించి స్టేషన్లలలో సదుపాయాల మెరుగుదలకు, ప్రయాణికుల సౌలభ్యానికి ఏర్పాట్లు దిశలో చర్యలు చేపడుతారు. ఇప్పటికే దేశంలో 199 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు పనులు తలపెట్టారు. 47 స్టేషన్లకు సంబంధించి టెండర్లను పిలిచారు. 32 స్టేషన్లలో పనులు వేగంగా సాగుతున్నాయి, మాస్టర్ ప్లానింగ్, డిజైనింగ్ పనులు గురించి ఆలోచిస్తున్నారని కేబినెట్ భేటీ తరువాత రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రతిస్టేషన్‌కు తప్పనిసరిగా ఉండాల్సిన ఏర్పాట్లు గురించి నిర్ధేశించారు. విశాలమైన రూఫ్ ప్లాజా తప్పనిసరి. ఇందులో వివిధ స్టాల్స్‌కు వసతి ఉండాలి, కెఫెటెరియా, విశ్రాంతి వినోద సౌకర్యాలు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. నగరానికి ఇరువైపులా అనుసంధానం అయ్యేలా స్టేషన్ ఏర్పాటు ఉండాలి. రైల్వే ట్రాక్‌లకు ఇరు వైపలా స్టేషన్ బిల్డింగ్‌లు ఉండాల్సిందే. ఫుడ్‌కోర్టులు, వెయిటింగ్ లాంజ్‌లు , పిల్లలకు ఆడుకునే ప్రాంతాలు తప్పనిసరి. దివ్యాంగులకు సహకరించేందుకు ఫ్రెండ్లీ ఏర్పాట్లు తప్పనిసరి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News