Tuesday, April 30, 2024

అమెరికాలో హరికేన్ బీభత్సం

- Advertisement -
- Advertisement -

Hurricane Ian in America

ఫ్లోరిడా : అమెరికాలో హరికేన్ ‘ఇయన్’ బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఇది ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, 200 కిమీ పైగా వేగంతో వీచిన భీకర గాలులతో తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అమెరికాలో రికార్డైన అత్యంత శక్తిమంతమైన తుపానుల్లో ఇదొకటని అధికారులు వెల్లడించారు. ఈ భయానక గాలుల వేగానికి లైవ్‌లో పరిస్థితి వివరిస్తున్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంత పనైంది. ఇళ్లు తేలియాడుతున్న దృశ్యాలు, నగర వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొని వచ్చిన వీడియోలు వెలుగు లోకి వచ్చాయి. ఈ హరికేన్ ధాటికి తీర ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. 20 మందితో కూడిన వలసదారుల పడవ మునిగి పోయిందని యూఎస్ బోర్టర్ పెట్రోలింగ్ అధికారులు వెల్లడించారు.

అయితే వారిలో కొందరిని రక్షించినట్టు చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన హరికేన్ బుధవారం సాయంత్రం తీరాన్ని తాకిందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. నేపుల్స్‌లో వరద నీరు ఇళ్లలోకి ఉప్పొంగిందని, రోడ్లు మునిగిపోయి, వాహనాలు కొట్టుకుపోయినట్టు టీవీ దృశ్యాలు బట్టి తెలుస్తోంది. మరోపక్క ఈ హరికేన్‌ను కవర్ చేస్తోన్న రిపోర్టర్ గాలి వేగానికి నిల్చోలేక పోయాడు. నేను నిల్చోలేక పోతున్నాను. గాలికి ఎగిరిపోతున్నాను అంటూ అతడు అరవడం వినిపిస్తోంది. తరానికి ఒకసారి వచ్చే విపత్తు వంటిదని అధికారులు హెచ్చరించారు. తీరం నుంచి లోపలికి వెళ్లే క్రమంలో దీని తీవ్రత తగ్గుతుందని హరికేన్ కేంద్రం అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News