Saturday, May 18, 2024

చైనాకు వెళుతున్న ఈరాన్ విమానానికి బాంబు భయం

- Advertisement -
- Advertisement -
Reported Bomb scare for Iran Plane
భారత గగనతనంలో హై డ్రామా

న్యూఢిల్లీ:   భారత వైమానిక దళం  అక్టోబర్ 3న భారత గగనతలం గుండా చైనాకు వెళుతున్న ఇరాన్ విమానయాన సంస్థలో బాంబు బెదిరింపు రావడంతో యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుంది. కానీ “బాంబు భయాన్ని విస్మరించండి” అని టెహ్రాన్ నుండి సందేశం రావడంతో సమస్య పరిసమాప్తం అయింది.  ఆ తర్వాత ఆ విమానం తన ప్రయాణాన్ని కొనసాగించిందని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. బాంబు బెదిరింపు రాగానే విమానాన్ని జైపూర్‌లో  లేక  చండీగఢ్‌లో ల్యాండ్ చేయడానికి అవకాశం ఇవ్వబడింది.  అయితే పైలట్ రెండు విమానాశ్రయాలలో దేనివైపు  మళ్లించడానికి ఇష్టపడలేదు.  “కొంతసేపటి తర్వాత, బాంబు భయాన్ని విస్మరించమని టెహ్రాన్ నుండి సమాచారం అందింది, దానిని అనుసరించి, విమానం తన చివరి గమ్యస్థానం వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.” అని భారత వైమానిక దళం వివరించింది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ,  బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీతో సంయుక్తంగా నిర్దేశించిన విధానం ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నట్లు వైమానిక దళం తెలిపింది. ఈ విమానం ఆకాశంలో వెళుతున్నప్పుడు  భారత గగనతలం అంతటా భారత వాయు సేన రాడార్ నిఘాలో ఉండిందని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News