Tuesday, May 7, 2024

క్రోమ్ లోని అనేక బగ్స్ ను సరిచేసిన గూగుల్

- Advertisement -
- Advertisement -

Google Chrome

వాషింగ్టన్: క్రోమ్ బ్రౌజర్ లోని అనేక సెక్యూరిటీ బగ్స్‌ను గూగుల్ సరిచేసింది. క్రోమ్ వర్షన్ 106ను విడుదలచేసింది. క్రోమ్ బ్రౌజ ర్‌ను ప్రభావితం చేస్తున్న బగ్స్‌పై ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’(సిఈఆర్‌టి-ఐఎన్) శుక్రవారం నోట్స్ విడుదలచేసింది.రిమోట్ అటాకర్లు ఈ బగ్స్ ద్వారా దోచుకునే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించింది. పైగా ఆ బగ్స్ హై సీవియారిటీకి చెందినవిగా రేటింగ్ ఇచ్చింది. ఈ బగ్స్ ద్వారానే సైబర్ నేరగాళ్లు బ్రౌజర్ భద్రత రిస్ట్రిక్సన్స్ అధిగమించేస్తారని పేర్కొంది. పైగా వల్కనరేబుల్ సాఫ్ట్‌వేర్ సిస్టంలో పనిచేసేలా చేస్తారని పేర్కొంది. క్రోమ్‌లో అనేక భద్రతా లోపాలున్నట్లు సిఈఆర్‌టిఐఎన్ పేర్కొంది. దీంతోపాటు ఇతర సెక్యూరిటీ బగ్స్ కూడా ఉన్నట్లు, అవి నమ్మలేని డెవలపర్ టూల్స్‌లో కనుగొన్నట్లు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News