Monday, May 6, 2024

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం…

- Advertisement -
- Advertisement -

heavy snowfall in uttarakhand

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమపాతంలో 28 మంది పర్యతారోహకులు చిక్కుకున్నారు. ఎనిమిది మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోఖ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం మిగితా పర్వతారోహకుల కోసం హెలికాప్టర్లలో గాలిస్తున్నామని చెప్పారు. ద్రౌపతి దండా-2 పర్వత శిఖరంపై భారీగా మంచు కురిసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రక్షణశాఖ మంత్రికి ఫోన్ చేసి ఆర్మీ సాయం కోరారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, బిఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పినట్టుగా పుష్కర్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News