Thursday, May 9, 2024

సిఎం కెసిఆర్‌తో కుమారస్వామి భేటీ

- Advertisement -
- Advertisement -

HD Kumaraswamy meets Telangana CM KCR

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సందర్భంగా, సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు కర్నాటక నుంచి ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వారితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం, అదే సందర్భంగా, తమిళ నాడు నుంచి ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె)పార్టీ అధినేత ‘చిదంబరం పార్లమెంట్ సభ్యుడు’, ప్రముఖ దళిత నేత తిరుమావళవన్, వారితో పాటు వచ్చిన ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్నది. ప్రగతి భవన్ వచ్చిన కుమారస్వామి బృందాన్ని, తిరుమావళవన్ బృందాన్ని, టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యమిచ్చారు. ఈ విందులో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News