Tuesday, April 30, 2024

ముంబైలో ఐవీడీ తయారీ కేంద్రం ప్రారంభించిన లార్డ్స్‌మెడ్‌

- Advertisement -
- Advertisement -

Lords Med launches IVD in Mumbai

ముంబై: లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ విభాగం లార్డ్స్‌ మెడ్‌ తమ ఐవీడీ తయారీ కేంద్రంను ముంబై సమీపంలోని వాసై వద్ద ప్రారంభించింది. ఈ సదుపాయం 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఐవీడీ తయారీ కేంద్రంలో అత్యాధునిక సాంకేతికతలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విస్తృతశ్రేణిలో ఐవీడీ తయారుచేయడంతో పాటుగా పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ డయాగ్నోస్టిక్‌ పరిష్కారాలైనటువంటి ఎనలైజర్లు, క్లీనికల్‌ బయోకెమిస్ట్రీ కోసం రీఏజెంట్లు, హెమటాలజీ, ఇమ్యునాలజీ, ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ (ఐసీఎంఆర్‌ ధృవీకరించి యాంటిజెన్‌ కిట్‌) మరియు ల్యాబ్‌ కన్స్యూమబల్స్‌ ఉన్నాయి. ఈ తయారీ కేంద్రంలో బయో కెమిస్ట్రీ, హెమటాలజీ, సెరాలజీచ ర్యాపిడ్‌ టెస్ట్‌ మరియు యూరిన్‌ స్ట్రిప్‌ పరీక్షలు సహా నెలకు 1.7 కోట్ల డయాగ్నోస్టిక్‌ పరీక్షలను చేసే సదుపాయం ఉంది. లార్డ్స్‌ మెడ్‌ ఈ సదుపాయాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. దీనికోసం 33 కోట్ల రూపాయలను భవిష్యత్‌లో పెట్టుబడిగా పెట్టనుంది.

ఈ అత్యాధునిక ఐవీడీ తయారీ కేంద్రంతో, బ్యాక్‌వార్డ్‌ ఇంటిగ్రేషన్‌ కు తోడ్పడటానికి లార్డ్స్‌ మెడ్‌ ప్రణాళిక చేసింది. దిగుమతులపై ఆధారపడటం తగ్గించడంతో పాటుగా సేకరణ పరంగా స్వీయ సమృద్ధి సాధించడం, ఓఈఎం మార్కెట్‌లో ప్రవేశించడం లక్ష్యంగా చేసుకుంది. లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పుడు ఐవీడీ తయారీ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామి కావాలనే భారీ లక్ష్యం పెట్టుకోవడంతో పాటుగా నాణ్యమైన ఐవీడీ పరిష్కారాలను అతి తక్కువ ధరలలో ఎగుమతి చేయడం చేయనుంది. లార్డ్స్‌ మెడ్‌ ఇప్పుడు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతో ఓఈఎం అవకాశాల కోసం మాట్లాడటంతో పాటుగా దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లలో మరిన్ని అవకాశాల కోసం అన్వేషిస్తోంది. ఈ కంపెనీ ఇప్పుడు ఆర్‌ అండ్‌ డీ భాగస్వామ్యాలను చేసుకోవడం ద్వారా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ను సైతం అభివృద్ధి చేయనుంది.

లార్డ్స్‌మెడ్‌ ఇటీవలనే సింగపూర్‌ కేంద్రంగా కలిగిన డయాగ్నోస్టిక్స్‌ కిట్‌ తయారీదారు సెన్సింగ్‌ సెల్ఫ్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ డయాగ్నోస్టిక్స్‌ పరిష్కారాలను తయారుచేస్తుంది. సెన్సింగ్‌ సెల్ఫ్‌ కోసం పూర్తి స్ధాయి తయారీసదుపాయాలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. లార్డ్స్‌ మెడ్‌ ఇప్పుడు ఆఫ్రికాలోని పలు సుప్రసిద్ధ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో కీలక మార్కెట్‌లలో తమ ఐవీడీ పరిష్కారాలను ఎగుమతి చేస్తుంది. భారతదేశంలో ఈ కంపెనీ తమ ప్రస్తుత డిస్ట్రిబ్యూషన్‌ ఛానెల్స్‌పై ఆధారపడటంతో పాటుగా తమ తయారీ ఉత్పత్తులను ప్రైవేట్‌, ప్రభుత్వ హాస్పిటల్స్‌, పాథాలజీ ల్యాబ్స్‌ మరియు రిటైల్‌ సంస్ధలకు విక్రయిస్తుంది. ఈ కంపెనీ బీ2జీ విభాగంలో శక్తివంతంగా ఉండటంతో పాటుగా ఇప్పుడు బీ2బీ మరియు బీ2సీ విభాగాలను సైతం లక్ష్యంగా చేసుకుని ఐవీడీ కిట్స్‌ కోసం డిమాండ్‌ను విస్తరించబోతుంది.

ఐవీడీ తయారీ కేంద్రం ప్రారంభం గురించి లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌, సచిదానంద ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ.. ‘‘అత్యాధునిక ఐవీడీ తయారీ కేంద్రం ప్రారంభించడమనేది ప్రభుత్వ లక్ష్యం నుంచి స్ఫూర్తిగా తీసుకోబడింది మరియు ఇండియాను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా నిలుపాలనే ప్రయత్నాలలో భాగం. కొవిడ్‌ మహమ్మారి ఐవీడీ మరియు పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ డయాగ్నోస్టిక్స్‌ పరిష్కారాలకు భారీ మార్కెట్‌ అవకాశాలను తెరిచింది. మా ఐవీడీ తయారీ కేంద్రంతో , వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను ఇండియాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఒడిసిపట్టనున్నాము. ఫార్మాస్యూటికల్‌ లేదా హెల్త్‌కేర్‌ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకోవడానికి అవకాశాలను అన్వేషిస్తుండటంతో పాటుగా పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ డయాగ్నోస్టిక్స్‌ విభాగంలో సైతం ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాము. ఐవీడీ తయారీ మరియు ఎగుమతుల రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలువాలనే మా లక్ష్య సాధనకు పునాదిని వాసైలోని ఈ తయారీ కేంద్రం వేసింది. భారతదేశాన్ని ఐవీడీ సొల్యూషన్స్‌ తయారీ కోసం అంతర్జాతీయ కేంద్రంగా నిలుపడానికి ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News