Tuesday, April 30, 2024

ఆర్‌టిసి ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు

- Advertisement -
- Advertisement -

ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు
నిర్వహిస్తున్న అధికారులు

మన తెలంగాణ, హైదరాబాద్ : ఆర్‌టిసి ఎండిగా సజ్జన్నార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు కార్యక్రమాలు, ప్రత్యేక పథకాలతో సంస్థను అభివృద్ది పథంలో నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 97 డిపోల్లో ఇప్పటికే 20 డిపోలకుపైగా లాభాలబాట పట్టించారు. అదే ఒరవడిని గ్రేటర్‌లో కూడా కొనకననొసాగించి గ్రేటర్‌లోని 29 డిపోలను కూడా లాభాల బాట పట్టించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్‌లోని ప్రయాణికులను కాకుండా నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు అధికంగా ఉపయోగించే యాజ్‌యు లైక్ టికెట్ ధరను రూ.120 నుంచి 100 తగ్గించారు. అంతే కాకుండా బస్సులు ఎక్కే సమయంలో ప్రయాణికులు బస్టాపుల్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్టాపుల్లో ప్రైవేట్ వానాలు ( ఆటోలు, క్యాబ్‌లు) ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు.బస్టాపుల్లో అక్రమంగా తిష్టవేస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల సహాయంతో భారీ ఎత్తున ఫైన్‌లు విధిస్తున్నారు.బస్ బే లలో బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు బస్ బేలో లలో బస్సులు ఆపకుండా ముందకు వెళ్ళే డ్రైవర్లపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.

ప్రయాణికులకు బస్సులు రాక పోకల సమాచారాన్ని అందించడమే కాకుండా బస్సులు బస్టాపులకు వచ్చే సమయాలను కూడా ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు.అంతే కాకుండా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిచడం ద్వారా వచ్చే సమస్యలను.. ఆర్‌టిసిలో బస్సుల్లో ప్రయాణికులకు ఉన్న భద్రతకు తీసుకుంటున్న చర్యలు గురించి ప్రయాణికులకు అవగాహన కలిగిస్తూ వారు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించే విధంగా అవగాహన కలిగిస్తున్నారు.

సాధారణ ప్రయాణికులకు అర్దయ్యే విధంగా సంస్థలో పనిచేసే సిబ్బందితో ప్రత్యేకవేశాధారణతో గ్రూపులను ఏర్పాటు చేసి వారికి బస్సుల్లో ప్రయాణించడం ద్వారా వచ్చే లాభాలను, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిచడం ద్వారా కలిగేనష్టాలను పాటల రూపంలో , సాంస్కృతిక కార్యక్రమాలు ,నృత్యప్రదర్శనల ద్వారా వివరిస్తూ వారిని ఆర్‌టిసిబస్సుల్లో ప్రయాణంచేలా కృషి చేస్తున్నారు. ప్రధాన స్టేషన్‌లలో సిబ్బంది తమ బస్సు ఏ రూట్‌లో వెళుతుంది, ఏస్టాపుల్లో ఆగుతుందని అనే అంశాలను మైక్‌ల ద్వారా ప్రయాణికులకు వివరిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారు దిగాల్సిన స్టాపులను వారికి గుర్తు చేయడమే కాకుండా వారు దిగాల్సిన స్టాపుల్లో వారిని దించుతున్నారు. ప్రతి బస్టాపులో బస్సులను ఆపి ఆయాస్టాపుల్లో ఒకరిద్దరు ఉన్నా ఆపి మరీ బస్సులను ఎక్కించకుంటూ సంస్థ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నారు. అంతే కాకుండా అధికారులు సైతం ప్రయాణికుల రవాణ అవసరాలను దృష్టిలో ఉంచకుని రద్దీ లేని ప్రాంతాల్లో బస్సులను తగ్గించి రద్దీ అధికంగా ఉన్నా ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించి వారి ఆదరణ చూరగొనేందుకు ప్రత్యేకంగా ఎనిమిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News