Friday, May 3, 2024

పిఎస్‌ఎల్‌వి బదులు ఇక ఎన్‌జిఎల్‌వి

- Advertisement -
- Advertisement -

ISRO’s plans for reusable next-generation launch vehicle

ఇస్రో నుంచి రేపటి తరం రాకెట్

తిరువనంతపురం : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త వాహక నౌకను రూపొందిస్తోంది. ఇప్పటివరకూ పలు కీలక ప్రయోగాలలో వినియోగించిన పిఎస్‌ఎల్‌వి స్థానంలో వచ్చే ఈ రాకెట్‌ను భావి అవసరాల కోణంలో తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు దీనికి నెక్ట్ జనరేషన్ లాంఛ్ వెహికల్ (ఎన్‌జిఎల్‌వి) అని పేరు పెట్టారు. కొత్త వాహకనౌక వివరాల గురించి ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కేరళలోని వలియమాలలో ఉన్న ఎల్‌పిఎస్‌సి కార్యాలయంలో జరిగిన ఇంజనీర్స్ కాన్‌క్లేవ్ 2022 నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ మాట్లాడారు. పిఎస్‌ఎల్‌విని 1980 దశకంలో రూపొందించారు. ఇప్పటికే 20 ఏళ్లుదాటాయి. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ కోణంలో ఇప్పుడు ఇస్రో ప్రయోగాలకు అనువుగా కొత్త రాకెట్‌ను తయారు చేస్తున్నట్లు వివరించారు. అయితే పిఎస్‌ఎల్‌వికి ఎప్పటికి పూర్తి స్థాయిలో ముగింపు ఉంటుందనే అంశంపై ఆయన జవాబు ఇవ్వలేదు. అయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన కొన్ని శాటిలైట్ల ప్రయోగాలు ఇతర ఇస్రో కార్యక్రమాల ముగింపు తరువాత పిఎస్‌ఎల్‌వికి విరమణ ఉంటుందని తెలిపారు. ఇక రాబోయే ఎన్‌జిఎల్‌వి రాకెట్‌లో సెమి క్రయోజెనిక్ టెక్నాలజీ ఉంటుందన్నారు. ఇది సమర్థవంతం, తక్కువ వ్యయంతో కూడుకున్నది అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News