Thursday, September 18, 2025

పూజకు ఫుల్ రెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇటీవల షూటింగ్‌లో కాలు బెణకడంతో పూజహెగ్డే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. రెండు వారాల పాటు ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. ఐతే, ఆమెకి అనుకోకుండా ఇంకా ఎక్కువ రోజుల విశ్రాంతి దొరకనుంది. సల్మాన్‌ఖాన్‌కి తాజాగా డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న సల్మాన్ మూడు వారాల పాటు షూటింగ్‌ని రద్దు చేశారు. పూజ హెగ్డే, సల్మాన్ ఖాన్ జంటగా ‘కిసి కా భాయ్, కిసి కి జాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే పూజ హెగ్డే కాలుకి గాయమైంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే సల్మాన్‌కి డెంగ్యూ వచ్చింది. దీంతో ఆమెకి అనుకోకుండా ఇంకా ఎక్కువ రోజుల విశ్రాంతి దొరికింది. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో సల్మాన్ ఖాన్ సినిమానే కాకుండా మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమా నవంబర్‌లో మొదలవుతుంది. అప్పటి వరకు పూజ రెస్ట్ తీసుకోనుంది.

Pooja Hegde rest at home after leg injury

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News