Wednesday, May 8, 2024

ఆన్‌లైన్ పిహెచ్‌డి పట్టాలు చెల్లనేరవు

- Advertisement -
- Advertisement -

Online PhD degrees are invalid:AICTE

యుజిసి, సాంకేతిక మండలి హెచ్చరిక

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో పిహెచ్‌డీ డిగ్రీలని చెప్పే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని యుజిసి, సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) ఓ ప్రకటన వెలువరించింది. విదేశీ విద్యాసంస్థల సహకారంతో పిహెచ్‌డి ప్రోగ్రాం కోర్సులని పేర్కొంటూ ఎడ్యుటెక్ కంపెనీలు ప్రకటనలు వెలువరించడంపై స్పందించారు. ఇటువంటి ఆన్‌లైన్ పిహెచ్‌డిలకు ఎటువంటి గుర్తింపు లేదని, వీటి వలలో పడి అమూల్యమైన సమయం , డబ్బు వృధా చేసుకోవద్దని యుజిసిశుక్రవారం సూచించింది. ఇటువంటి హెచ్చరికలను యుజిసి , ఉన్నత సాంకేతిక విద్యా నియంత్రణ సంస్థలు వెలువరించడం ఈ ఏడాది ఇది రెండోసారి. దేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు ఏ విధంగా కూడా ఇటువంటి ఆన్‌లైన్ పిహెచ్‌డి కోర్సులను ప్రతిపాదించవద్దని, ఎడ్యు టెక్ కంపెనీలతో కలిసి ఆన్‌లైన్ దూరవిద్య పిహెచ్‌డి కోర్సులు అందిస్తామని తెలియచేయడం చట్టరీత్యా చెల్లనేరదని , ఈ విధంగా ఎటువంటి ఫ్రాంఛైజ్ ఒప్పందానికి దిగరాదని ఇంతకు ముందే యుజిసి, ఎఐసిటిఇ స్పష్టం చేశాయి.

పిహెచ్‌డి డిగ్రీల ప్రదానానికి సంబంధించి నిర్ధేశిత నియమనిబంధనలు ఉంటాయి. ప్రామాణికత అంశాలు నిర్ధేశిస్తారు. ఎంఫిల్, పిహెచ్‌డి డిగ్రీల కనీస ప్రమాణాల నియంత్రణల విధానం 2016ను వెలువరించినట్లు, ఈ పరిధిలోనే పిహెచ్‌డి ఇతరత్రా ఉన్నత విద్యాకోర్సుల అభ్యాసానికి వీలుంటుందని , దీనిని విద్యార్థులు, పిహెచ్‌డి చేయాలనుకునేవారు దృష్టిలో పెట్టుకుని తీరాలని ఈ రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తాజాగా తెలిపాయి. యుజిసి గుర్తింపు పొందని ఆన్‌లైన్ పిహెచ్‌డి పట్టాలు తీసుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదని ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యార్థులు, ఆసక్తిగల వారు పిహెచ్‌డి పట్టాల వివరాలను తెలుసుకున్న తరువాతనే వీటిలో చేరాల్సి ఉంటుంది, ప్రామాణిక నిబంధనలను పాటిస్తున్నారా? అనేది గమనించి వీటిలో చేరాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News