Sunday, July 20, 2025

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

husband kills wife at jagtial district

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏకినాపూర్ లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తను కట్టుకున్న భార్యను కిరాతకంగా రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఎస్సారెస్పీ కాలువలో పడేశాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు(చంద్ర)ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం కోసం ఎస్సారెస్పీ కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News