Thursday, May 2, 2024

ఇప్పటంలో వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు

- Advertisement -
- Advertisement -

గుంటూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పటం పర్యటన అనంతరం దివంగత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అధికారులు సోమవారం తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో గ్రామంలోని సుమారు 52 ఇళ్లను కూల్చివేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించిన ముచ్చట తెలిసిందే. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎందుకు తొలగించడం లేదని, మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలను ఎందుకు తొలగించారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎట్టకేలకు అధికారులు ఈరోజు క్రేన్ సాయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించి మరో చోటికి తరలించారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ది కోసమంటూ ఇప్పటంలో ఇళ్లు, మహనీయుల విగ్రహాల కూల్చివేతపై వివాదం జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News