Tuesday, April 30, 2024

హత్యాచార దోషులను నిర్దోషులుగా తేల్చేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -
నీరుగారిపోయిన పోలీసుల వినతి

న్యూఢిల్లీ: చాలా ఏళ్ల కిందట ఢిల్లీలో జరిగిన సామూహిక హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు ఢిల్లీ హైకోర్టు మరణిశిక్ష విధించగా, వారిని సుప్రీంకోర్టు సోమవారం నిర్దోషులుగా విడుదలచేసింది. 2012లో ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో 19 ఏళ్ల అమ్మాయి అత్యాచారం, హత్యకు గురైంది. ఢిల్లీ పోలీసులు ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు యువకులు రవి కుమార్, వినోద్, రాహుల్ అనే వారిపై కేసు నమోదు చేవారు. హతురాలి మృత దేహాన్ని హరియాణాలోని ఓ పొలంలో గుర్తించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు. తొలుత ట్రయల్ కోర్టు వారికి మరణ శిక్ష విధించింది. వారు తీర్పును సవాలుచేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ట్రయల్ కోర్లు తీర్పును సమర్థించింది. 2014లో వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దోషుల పిటిషన్‌ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. అయినప్పటికీ డిఫెన్స్ కౌన్సిల్ వారి వయస్సు, కుటుంబ నేపథ్యం వంటివి పరిగణనలోకి తీసుకుని శిక్షపై తీర్పునివ్వాలని కోరారు. వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు చివరికి సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. దోషుల ఉరిశిక్షను రద్దు చేయడమేకాక, వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలావుండగా బాధితరాలు కుటుంబ సభ్యులు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News