Monday, May 6, 2024

సంపద పెంచి ప్రజలకు పంచాలన్నదే కెసిఆర్ లక్ష్యం: నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వనపర్తి: సంపద పెంచి ప్రజలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77 మందికి రూ.21.09 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసి, మంత్రి లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అభాగ్యులకు సాయం అందిస్తున్నారని, పేద ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.1లక్ష 116 సాయం అందిస్తున్నారని, రైతుబంధుతో ఎకరాకు ఏడాదికి రూ.10వేలు సాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రూ.200 ఉన్న పింఛన్ రూ.2016లు చేయడం జరిగిందని, రూ.500 ఉన్న పింఛన్‌ను రూ.3016 లకు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు కాన్పు అయితే ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు, కేసీఆర్ కిట్ కానుకలు అందించడం జరిగిందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ అని ఆయన పేర్కొన్నారు. సాగునీటి రాకతో తెలంగాణలోని ప్రతి పల్లె సస్యశ్యామలం అయిందని, 60 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధికి కేవలం 8 ఏండ్లలో కేసీఆర్ అభివృద్ధి చేసి చూయించారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News