Wednesday, May 15, 2024

కాంతారావుకు నివాళులర్పించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నాటి తరం ప్రఖ్యాత నటుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి (నవంబర్ 16) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కాంతారావు 400 కు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారని, వారు సినీ కళారంగానికి చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్ ఏఎన్నార్ లు రెండు కండ్లయితే, ‘నుదుట తిలకం’గా కాంతారావు ఖ్యాతి గడించడం తెలంగాణ కు గర్వకారణమని సిఎం కెసిఆర్ అన్నారు.

CM KCR pays Tribute Actor Kantha Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News