Tuesday, May 7, 2024

బర్రె నోట్లో పేలిన మందుగుండు

- Advertisement -
- Advertisement -

 

ఆమనగల్లు : మేత కోసం వెళ్లిన బర్రె మందుగుండు పెలి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆమనగల్లు పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక రైతు లండం యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో మేత కో సం వెళ్లిన బర్రె అడవి పందుల కోసం పెట్టిన మందుగుండును కొరకడంతో అది పేలి బర్రె నోటి భాగం చిద్రమైన ట్లు తెలిపారు. వెంటనే స్థానిక పశువైద్యుడికి సమాచారం అందించారు. వైద్యు డు రుద్రాక్ష విజయ్‌కుమార్ సకాలంలో చేరుకోని బర్రెను పరిశీలించగా వై ద్యం చేయాడానికి వీలు లేకుండా నోరు చిద్రమైనట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎసై సంఘటన స్థలానికి చేరుకోని వివరాలను సేకరించారు. బాధిత రైతు యాదయ్య ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News