Wednesday, May 1, 2024

ట్రాఫిక్ చలాన్లపై పుకార్లు ప్రచారం చేస్తే చర్యలు.. ఇవే నూతన నిబంధనలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రాఫిక్ చలాన్లపై పుకార్లు పుట్టిస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. గత నాలుగు రోజుల నుంచి ట్రాఫిక్ చలాన్లపై ప్రచారం జరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ట్రిపుల్ రైడింగ్ టూవీలర్‌కు గతంలో రూ.1,200 ఉందని దానినే అమలు చేస్తున్నామని, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు టూవీలర్ రూ.200, గతంలో 1,100 ఉందని, త్రీవీలర్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ రూ.2,00 జరిమానా, గతంలో రూ.1,100 జరిమానా విధించారు.

ఫోర్ వీలర్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలకు రూ.700 జరిమానా విధించనున్నారు, ఇది గతంలో రూ.1,100 ఉందని పేర్కొన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ టూ వీలర్ వాళ్లు ఆరు నెలలోపు మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.700 జరిమానా విధించనున్నారు, త్రీవీలర్ వారికి రూ.700 జరిమానా విధించనున్నారు. ఫోర్ వీలర్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు ఆరు నెలలోపు మళ్లీ రాంగ్ రూట్‌లో వెళ్లితే రూ.1,700 జరిమానా విధించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News