Tuesday, April 30, 2024

సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటా: కీర్తి సురేశ్

- Advertisement -
- Advertisement -

సాధారణంగా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కాస్టింగ్ కష్టాలు తప్పవని పలువురు నటీమణులు స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారికి అలాంటి కష్టాలు ఉండవన్న విషయం తెలుసిందే.

ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ అందరికీ సుపరిచితమే. రీసెంట్‌గా కీర్తి సురేష్ తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిపరిశ్రమలో అవకాశాల కోసం చూసే మహిళలకు వేధింపులు నిజమేనని, కాస్టింగ్ కౌచ్ ఉందని కీర్తి సురేష్ స్పష్టం చేశారు.

కానీ ఇప్పటివరకు తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని తెలిపారు. తను కమిట్ మెంట్ కు ఒప్పుకుంటేనే ఛాన్స్ ఇస్తానని చెబితే వెంటనే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి మంచి ఉద్యోగం చేసుకుంటానని, అలాంటి వాటికి ఒప్పుకోనని తేల్చిచెప్పింది. కీర్తి సురేశ్ ప్రస్తుతం నానితో దసరా, మెగస్టార్ చిరంజీవి భోళాశంకర్, తో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News