Sunday, June 2, 2024

15 పరుగులకే ఆలౌట్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ థండర్స్ చెత్త రికార్డు
బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్ సంచలనం

సిడ్నీ: ప్రతిష్టాత్మకమైన బిగ్‌బాష్ టి20 లీగ్‌లో సిడ్నీ థండర్స్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ 15 పరుగులకే ఆలౌటైంది. టి20 ఫార్మాట్‌లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రిస్ లీన్ (36), గ్రాండోమ్ (33) మాత్రమే కాస్త రాణించారు. తర్వాత స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్‌ను ప్రత్యర్థి జట్టు బౌలర్లు 15 పరుగులకే కుప్పకూల్చారు. పేలవమైన బ్యాటింగ్‌ను కనబరిచిన సిడ్నీ థండర్స్ 5.5 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. అడిలైడ్ బౌలర్లలో థాంప్టన్ 3 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. వెస్ అగర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News