Monday, May 6, 2024

ఎపి రాజధాని అమరావతే..

- Advertisement -
- Advertisement -

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఢిల్లీలో అమరావతి రైతులు నినాదాలు చేశారు. ఎపికి మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకే రాజధాని కోరుతూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో తమ డిమాండ్లను బలంగా వినిపించారు. ధరణికోట టూ ఎర్రకోట పేరుతో ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్న రైతులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జై అమరావతి అంటూ నినాదించారు.

అమరావతి రైతుల ధర్నాకు టిడిపి, జనసేన, కాంగ్రెస్, సిపిఎ పార్టీల నేతలు మద్దతు పలికారు. ఆ పార్టీల నేతలు కూడా రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఎపికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ఆయా పార్టీల నేతలను అమరావతి నేతలు కలిసి మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరిస్తున్నారు. అలాగే ఈనెల 19న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరగనున్న భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో పాల్గొని అమరావతి రాజధాని వాణిని వినిపిస్తామని ఎపి రైతులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News