Thursday, August 21, 2025

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ నుంచి తాండూరు మీదుగా సాగే రైల్వే సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. శనివారం వికారాబాద్ మీదుగా కర్నాటక వైపు వెళుతున్న గూడ్స్ రైళు కర్నాటకలోని సులానీ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది.

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ,హుస్సేన్‌సాగర్, బీజాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు దారి మళ్లించి సేవలను అందిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరో వైపు రైల్వే ప్రమాదం పై అధికారులు వెంటనే అప్రమత్తమై మరమ్మతులపై దృష్టి సారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News