Sunday, May 19, 2024

పవన్‌ను సిఎం అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించాలి : ఉండవల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలంటే చంద్రబాబే ఒక అడుగు వెనక్కితగ్గి పవన్‌ను సిఎంగా అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాల్సి వస్తుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకు టిడిపి ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్‌కు కొత్తగా పోయేది ఏమీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ చాల తెలివైన వ్యక్తి అని, ఆయనను సిఎం అభ్యర్థిగా ప్రకటించకుండా టిడిపితో పొత్తు పెట్టుకుంటారని తాను భావించడం లేదన్నారు. ఎపిలో టిడిపి పార్టీని సిఎం జగన్ భూస్థాపితం చేస్తారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News