Thursday, May 2, 2024

కోహ్లీ, బాబర్ అజమ్ రికార్డులను బద్దలు కొట్టిన గిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ గిల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ లో గిల్ 360 పరుగులు చేసి బాబర్ అజమ్ రికార్డును సమం చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీని రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో కోహ్లీ 283 పరుగులు చేయగా గిల్ ఏకంగా 360 పరుగులు చేశాడు. ఇప్పటికే భారత్ తరపున తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసి రికార్డులోకెక్కాడు. గత పది ఇన్నింగ్స్‌లో గిల్ పరుగులు 49, 50, 45, 13, 70, 21, 116, 208, 40, 112 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే రన్ మిషన్ కంటే ఫాస్ట్‌గా పరుగులు చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో ఇమ్రూల్ కయాస్ 349 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. గత 21 మ్యాచ్‌ల్లో గిల్ 1254 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ట్రాట్ 24 ఇన్నింగ్స్‌లో 1194 పరుగులు రెండో స్థానంలో ఉన్నాడు. ట్రాట్ రికార్డును కూడా గిల్ బద్దలు కొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News