Friday, May 3, 2024

వడ్డీ రేట్ల పెంపు కొనసాగవచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అధిక వడ్డీ రేట్ల కాలం చాలా కాలం పాటు కొనసాగవచ్చని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించవచ్చని అంచనా వేస్తున్నామని, అయితే వృద్ధి, ద్రవ్యోల్బణం రెండింటిలోనూ అధ్వాన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ కరెంట్ ఖాతా లోటు నిర్వహించదగనదే అని అన్నారు. దుబాయ్‌లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఐఎంఎండిఎ), ప్రైమరీ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(పిడిఐఎ) వార్షిక సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ పాల్గొని, ఈ విషయాలు వెల్లడించారు.

 

ద్రవ్యోల్బణం రేటు ఇంకా ఎక్కువగానే ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని తన లక్షం పరిధిలోకి తీసుకువచ్చేందుకు సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉందని శక్తికాంత దాస్ చెప్పారు. అయితే వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉండవచ్చని, ప్రస్తుతానికి దాని నుంచి ఉపశమనం లేదని ఆయన అన్నారు. గ్లోబల్ గ్రోత్ రేట్ పై స్పందిస్తూ, కొన్ని నెలల వరకు తీవ్ర మాంద్యం వచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు సాధారణ మాంద్యం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ అనిశ్చిత అంతర్జాతీయ వాతావరణంలో ‘భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది‘ అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News