Friday, July 11, 2025

మరో వివాదంలో చిక్కుకున్న బాలయ్య…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు, ఎంఎల్‌ఎ బాలకృష్ణ వ్యాఖ్యలపై నర్సుల సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్‌స్టాపబుల్ షోలో నర్సులను ఉద్దేశిస్తూ బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సారి బాలకృష్ణ మహిళలను కించపరుస్తన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ షోలో పవన్ కల్యాణ్‌కు తన యాక్సిడెంట్ గురించి వివరిస్తుండగా నర్సుల ప్రస్తావన తీసుకొచ్చాడు. బాలకృష్ణ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. గతంలో దేవ బ్రహ్మణులు, అక్కినేని నాగేశ్వర్ రావుపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యాన్స్ బాలకృష్ణ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News