Tuesday, April 30, 2024

బల్ల పై నుంచి పడటంతోనే వాణీజయరాం మరణం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రముఖ గాయని వాణీజయరాం పోస్టుమార్టం నివేదిక విడుదల అయింది. నివాసంలో ఒంటరిగా ఉంటున్న వాణీజయరాం రెండు అడుగుల ఎతైన పాత టేబుల్ పై నుంచి కిందపడిన క్రమంలో నుదుటికి బలమైన గాయాలు అయినట్లు, ఈ క్రమంలో రక్తస్రావంతోనే ఆమె మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడైంది. శనివారం గాయని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనితో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇప్పుడు నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆమెను ఎవరూ హత్య చేయలేదని, కిందపడిన దశలో తగిలిన గాయాలతోనే మరణించి ఉంటారని నివేదికలో తెలిపారు.

ఆమె నివాసంలోకి ఎవరూ వచ్చినట్లు ఎటువంటి సాక్షాధారాలు లేవని కూడా పోలీసులు తేల్చివేశారు. బల్లపై నుంచి ఆమె పడిపోతున్న క్రమంలో గాయాలతో బల్ల అంచుకు నెత్తురు ఉండటం వంటి అంశాలను పోలీసులు ఈ కేసులో కీలకంగా తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక, సిసిటీవీ ఫుటేజ్‌లు , ఫోరెన్సిక్ టెస్టుల తరువాత వాణీ జయరాం మృతిపై ఇతరత్రా ఎటువంటి అనుమానాలు లేవనే నిర్థారణకు వచ్చారు. అయితే బల్ల నుంచి ఆమె ఎందుకు పడ్డారనేది స్పష్టం కాలేదు. ఆదివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గాయని నివాసానికి వచ్చారు. ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించి వెళ్లారు. మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి, పోలీసు కేసు గురించి ఇక్కడనే అధికారులను ఆరాతీశారు. కాగా ఆదివారం వాణీజయరాం అంత్యక్రియలు జరిగాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ స్థానిక బీసెంట్ నగర్ విద్యుత్ శ్మశాన వాటికలో కార్యక్రమం ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News