Friday, May 3, 2024

ఐఎన్‌ఎస్ విక్రాంత్ అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత నావికాదళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ అరుదైన ఘనతను నమోదు చేసింది. భారత్‌లో తయారైన తేలికపాటి యుద్ధవిమానం విజయవంతంగా యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ల్యాండ్ అయిందని అధికార వర్గాలు తెలిపాయి. సముద్రంలో నిర్వహించినట్రయల్స్‌లో భాగంగా యుద్ధవిమానం విక్రాంత్‌పై ల్యాండ్ అయింది. ఆత్మనిర్భర్ భారత్‌లో ఇదొక చారిత్రాత్మక సంఘటనగా నావికాదళం పేర్కొంది.

భారతదేశం శక్తి సామర్థాలను ఇది ప్రపంచానికి చాటుతుందని నేవీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా 45వేల టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను రూ.20వేల కోట్ల వ్యయంతో నిర్మించి గతేడాది సెప్టెంబర్‌లో నావికాదళంలో ప్రవేశపెట్టారు. 262మీటర్ల పొడవు, 62మీటర్ల వెడల్పు ఉన్న భారీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను భారత్‌లో తయారుచేశారు. మిగ్ 29కె ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లతోపాటు మొత్తం 30విమానాలను తీసుకువెళ్లగల సామర్థం ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు ఉంది. ఈ యుద్ధనౌకలో సుమారు 1600మంది నేవీ సిబ్బంది ప్రయాణించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News