Sunday, May 5, 2024

అదానీ గ్రూపు నుంచి రూ. 1,651 కోట్ల వాటాలు ఉపసంహరించుకున్న నార్వే సంస్థ

- Advertisement -
- Advertisement -

ఓస్లో: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్థ నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ అదానీ గ్రూపు నుంచి తన ఆస్తులను ఉపసంహరించుకుంది. నార్వేలోని చమురు, సహజవాయువుకు నిధులను అందచేసేందుకు ఏర్పడిన సావరిన్ వెల్త్ ఫండ్ 2022 ముగింపు నాటికి అదానీ గ్రూపు కంపెనీలలో తాను పెట్టిన 200 మిలియన్ డాలర్ల(రూ. 1,651) కోట్ల పెట్టుబడులను గత ఐదు వారాలలో పూర్తిగా ఉపసంహరించుకుంది.

అదానీ గ్రీన్ ఎనర్జీలో 10.14 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌లో 0.17 శాతం, అదానీ పోర్టులు, స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో 0.3 శాతం వాటాలు ఈ ఫండ్‌కు ఉండేవి. కొత్త సంవత్సరంలో మొదటి ఐదు వారాలలోనే అదానీ గ్రూపులో ఉఉన్న తమ పెట్టుబడులను గణనీయంగా ఉపసంహరించుకున్నట్లు ఫండ్‌ను పర్యవేక్షించే ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్(ఇఎస్‌జి) సంస్థ అధిపతి క్రిస్టఫర్ రైట్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం తమ సంస్థకు అదానీ గ్రూపులో ఎటువంటి వాటాలు మిగలలేదని ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక బయటపడిన తర్వాత అదానీ గ్రూపు ఆస్తుల విలువ 120 బిలియన్ డాలర్లు క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News