Wednesday, May 1, 2024

వాతావరణంలో కోట్ల టన్నుల “ప్లాస్టిక్” కర్బన ఉద్గారాలు..

- Advertisement -
- Advertisement -

ప్లాస్టిక్ ఉత్పత్తుల సందర్భంగా వెలువడే కర్బన ఉద్గారాలతో వాతావరణం కలుషితమవుతోంది. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తుల కలుషితాల వల్ల వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే 2030 నాటికి బొగ్గు కంటే ప్లాస్టిక్ కారణంగానే అత్యధిక శాతం కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ అమెరికాయే భారీ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తిదారుగా నిలిచింది. ఏటా రూ.4.2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ అమెరికాలో ఉత్పత్తి అవుతోంది.

చైనా, ఐరోపా దేశాల్లో ఏటా ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ కంటే అమెరికా లోనే రెట్టింపు స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. అమెరికాలో ఏటా పోగుపడే తలసరి ప్లాస్టిక్ చెత్త 130 కిలోల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. ప్రపంచంలో ప్లాస్టిక్ ఉత్పత్తి వాణిజ్య పరంగా 1907లో ప్రారంభమైంది. 1952 నుంచి భారీస్థాయిలో ఉత్పత్తి కావడం మొదలైంది. ఇక సముద్రాల్లో ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే 2040 నాటికి 2.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తాయి.

సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్లనే ఏటా దాదాపు లక్షకు పైగా భారీ జలచరాలు అంతరించిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్లాస్టిక్ వినియోగం అనేక రూపాల్లో పెరిగిపోయింది. సాధారణంగా దేశంలో ప్రతి నిమిషం దాదాపు 12 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు వినియోగిస్తుండగా, కరోనా సమయంలో ఇది మరీ ఎక్కువైంది. ప్లాస్టిక్ కప్‌లు, కంటైనర్లు, కాయరీ బ్యాగ్‌లు, మినరల్ వాటర్ బాటిళ్లు, ఇలా ఎన్నో విధాలుగా ప్లాస్టిక్ నిత్యజీవితంలో వినియోగమవుతోంది. అయితే, దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమలులోకి వచ్చింది. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నియంత్రణకు చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News