Wednesday, May 15, 2024

జూనియర్ లాయర్లకు సర్కార్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ న్యాయవాదులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్ధికంగా అండగా నిలిచేలా న్యాయవాదుల కోసం వైఎస్‌ఆర్ లా నేస్తం పథకాన్ని ఏడాదికి రెండుసార్లు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొని వైఎస్‌ఆర్ లా నేస్తం పథకం కింది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో కోటి 55 వేలు నగదును జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనిలో భాగంగా ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకు రూ. 5 వేలు చొప్పున సాయం అందిస్తామని చెప్పారు.

గడిచిన మూడున్నరేళ్ళలో 4,248 మంది న్యాయవాదులకు రూ.35.45 కోట్లు ఖర్చు చేసి వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇకపై నెల నెలా కాకుండా ఒకే అమౌంట్ మొత్తాన్ని ఏడాదికి రెండుసార్లు చొప్పున న్యాయవాదుల ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా సమయంలో ఈ కార్పస్ ఫండ్ ద్వారా రూ.25 లక్షలతో న్యాయవాదులకు సాయం చేశామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News