Sunday, May 5, 2024

ఔషధాల కోసం సముద్ర గర్భ పరిశోధన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : క్యాన్సర్ చికిత్సకు కావలసిన యాంటీబయోటిక్ కోసం సముద్ర గర్భాల ఓషధులను లేదా సూక్ష్మజీవులను అన్వేషించే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు ప్రస్తుతం నిమగ్నమై ఉంటున్నారు. కొందరు సముద్రం అట్టడుగు భాగానికి గత ఈతగాళ్లను స్పీడ్ బోట్ల ద్వారా పంపిస్తుండగా, మరికొందరు రోబోలను పంపుతున్నారు. ఇంకొంతమంది మట్టి క్షిపణులను ప్రయోగిస్తున్నారు. వీరందరి లక్షం క్యాన్సర్ చికిత్సకు సరైన ఔషధాన్ని కనుగొనడమే. సముద్రం అట్టడుగున పేరుకుపోయిన బురదలో మసలాడే సూక్ష్మజీవుల నుంచి ఔషధ అణువును కనుగొనగలమని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. సముద్ర స్పాంజిల నుంచి, లేదా సముద్రం లోని సూకా్ష్మతి సూక్ష్మ జీవుల నుంచి , రాళ్లు లేదా పడవల అడుగున అంటుకుని వేలాడే గొట్టాం వంటి ఆకారం కలిగిన క్రిముల నుంచి, లేక నత్తలతో సహ జీవనం సాగించే బ్యాక్టీరియా నుంచి ఔషధ వనరులు కనుగొనగలమన్న ఆశతో అన్వేషణ సాగుతోంది. అల్జిమర్స్ లేదా మూర్ఛ వ్యాధులను నయం చేసే మూలకం లభించినట్టయితే దాన్ని ఔషధంగా అభివృద్ధి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

అలాగే కొన్ని మిలియన్ డాలర్ల వరకు ఖర్చ పెట్టవలసి వస్తుంది కూడా. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త మార్కెల్ జస్పార్స్ తన సహచరులు సముద్ర గర్భం నుంచి నమూనాలు సేకరించారని తెలిపారు. 16,400 అడుగుల పొడవైన భారీ లోహపు గొట్టాన్ని కేబుల్ ద్వారా సముద్ర గర్భం లోకి పంపి ఈ నమూనాలు సేకరించామని చెప్పారు. పెన్సిలిన్ వంటి ఔషధాలను, క్యాన్సర్ డ్రగ్స్‌ను సహజ వనరుల నుంచే కనుగొనగలిగారు. బ్యాక్టీరియాను తిప్పికొట్టగల ్టనమూనాను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొని దానికి 1926లో పెన్సిలిన్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి పరిశోధకులు మనుషుల రోగాలను నయం చేయడానికి మొక్కల నుంచి , జంతువులు, కీటకాలు సూక్ష్మజీవుల నుంచి తయారు చేసిన రసాయన కాంపౌండ్‌లను కనుగొనగలిగారు. 1991లో ఫెనికల్ ఆయన సహచరులు ఇప్పటివరకు ఎవరికీ తెలియని స్లైనిస్పోరా అనే సముద్ర బ్యాక్టీరియాను బహమాస్ సముద్ర తీరం బురదలో కనుగొన గలిగారు.

దశాబ్ద కాలం సాగించిన అధ్యయనం ఫలితంగా క్యాన్సర్‌ను నయం చేయగల రెండు రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడేది కాగా, రెండోది చికిత్సకు నయం కాని బ్రెయిన్ ట్యూమర్‌కు సంబంధించింది. స్పానిష్ బయోటెక్ సంస్థ ఫార్మామార్ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. వీరి మొదటి ఔషధం కోసం 300 టన్నుల బుల్బోస్ సీ స్కిర్ట్‌ను సముద్ర నుంచి సేకరించారు. ఒక టన్ను నుంచి ఒక గ్రాము కాంపౌండ్‌ను తయారు చేయగలుగుతున్నారు. ఈ సంస్థ ఇప్పుడు మూడు క్యాన్సర్ డ్రగ్స్‌కు అనుమతి పొందింది. ఈ ఔషధాలన్నీ సముద్రం లోని స్కిర్ట్‌అనే బ్యాక్టీరియాకు చెందినవే. అనుకున్నట్టుగా ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే పరిశోధనకు, మార్కెట్‌కు ఔషధాన్ని పంపడానికి 15 సంవత్సరాలు పడుతుందని స్పానిష్ బయోటెక్ సంస్థ కు చెందిన అధినేత క్యుయెవాస్ మార్కంటే వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News