Tuesday, April 30, 2024

కవిత ఒక్కరే మహిళనా..?

- Advertisement -
- Advertisement -

పెగడపల్లిః తెలంగాణ రాష్ట్రంలోని ఎంఎల్‌ఎలు, మంత్రులు తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శంకర్ నాయక్ వంటి నాయకులు అధికారుల పట్ల ప్రజాప్రతినిధుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, ఒక ఎంఎల్‌సిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ప్రథమ మహిళ అయిన గవర్నర్ తమిళసై అసెంబ్లీలో పాసయిన బిల్లును ఆమోదించకుండా ముడ్డి కింద పెట్టుకుని కూర్చుంటారా అని అన్నప్పుడు  రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి ఎందుకు సుమెటోగా తీసుకోలేదన్నారు. కౌశిక్‌రెడ్డి కరీంనగర్‌లో ఒక వేదికపై ఒక విద్యార్థితో బిఆర్‌ఎస్ నాయకులు కవిత కాళ్లు మెక్కిస్తే ఎందుకు నోటీసులు జారీ చేయలేదని మర్రిపెల్లి సత్యం ప్రశ్నించారు.

ఆదివారం మండల కేంద్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యం మాట్లాడుతూ అధికార పార్టీలోని మహిళా మంత్రులకు, ఎంఎల్‌ఎల అసభ్య ప్రవర్తన కనిపించ లేదా అని, ఒక కవిత మాత్రమే మహిళనా, సర్పంచ్ నవ్య ధరావత్ పీతి అమ్నెషియా పబ్ కేసులో గవర్నర్ విషయంలో మహిళా మంత్రులు ఎందుకు స్పందించలేదన్నారు. ఈ సమావేశంలో బిజెపి మండల ప్రధాన కార్యర్శులు పల్లె మోహన్‌రెడ్డి, పెంట నరేందర్, కార్యదర్శి వరద రాము, మండల సీనియర్ నాయకులు మూడపెల్లి తిరుపతి, నెల్లి చందు, బిజెవైఎం నాయకులు కాశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News