Tuesday, September 16, 2025

బాల వికాసపై ఐటి దాడులు అమానుషం :మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మూడు దశాబ్దాలుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాస సంస్థపై ఐటి దాడులు బాధాకరమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బాల వికాసపై ఐటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అవడంతోనే ఈ ఐటీ దాడులు చేశారని ఆరోపించించారు.ఈ దాడులు కక్ష్యసాధింపు చర్యలే అన్నారు.

లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.ఇలాంటి దాడులతో బాల వికాస లాంటి సంస్థల నిస్వార్థ ప్రజా సేవలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నదన్నారు. భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా ఆ సంస్థ సేవలను అపగలమా? అన్ని ఆయన ప్రశ్నించారు. ఎందరో ప్రముఖులు ప్రశంసించిన బాల వికాస సంస్థపై ఐటి దాడులు అవమానకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News