Monday, May 6, 2024

ఏప్రిల్ 3 న కెటిఆర్ పర్యటనను అడ్డుకుంటాం: తల్లోజు ఆచారి

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు: ఏప్రిల్ 3వ తేదిన ఆమనగల్లులో నిర్వహించే మంత్రి కెటిఆర్ పర్యటనను బిజెపి ఆధ్వర్యంలో కడ్తాల నుండి ఆమనగల్లు వరకు అడ్డుకుంటామని  తల్లోజు ఆచారి గురువారం విలేఖరుల సమావేశంలో  తెలిపారు.ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటి పరిధిలోని సాకిబండ తాండా సమీపంలో ఏర్పాటు చేసిన మైనింగ్‌ను వెంటనే మూసివేయాలని జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా మైనింగ్‌కు అనుమతులు ఇచ్చి గిరిజనుల పంట పొలాలు, ఇండ్లను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కల్వకుర్తి ఎంఎల్ఎ గుర్క జైపాల్‌ యాదవ్ ఏకపక్షంగా నియంతలాగా వ్యవహరిస్తూ ఆమనగల్లు మున్సిపాలిటిలో కార్యక్రమాలను ఏర్పాటు చేసి గిరిజనుడైన చైర్మెన్ రాంపాల్ నాయక్‌ను, పాలకవర్గాన్ని అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంఎల్ఎ గా ఎన్నికైనప్పటినుండి ఇప్పటివరకు ఆమనగల్లు అభివృద్దికి ఒక్క రూపాయికూడా ఇవ్వలేదన్నారు. 2018 ఎన్నికల ముందు అప్పట్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కృషి ఫలితంగానే మున్సిపాలిటికి గ్రాంట్ క్రింద రూ. 15కోట్లు మంజూరు అయ్యాయని రూ. 15కోట్లు చేసే పనులకు మున్సిపల్ పాలకవర్గం ఆమోదించిందని గత ఏడాది సాంకేతిక అనుమతులు కూడ లభించాయని 6నెలల క్రితం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందన్నారు.

సాకిబండతాండా వద్ద ఏర్పాటు చేసిన మైనింగ్‌కు ప్రజాభ్రిపాయ సేకరణ జరపకుండా అనుమతులు ఇచ్చిన అక్రమ మైనింగ్‌లో ఎమ్మెల్యేకు భాగస్వామ్యం వుందని ఆచారి ఆరోపించారు. మైనింగ్ వల్ల పంటపొలాలు, ఇండ్లు, బోరుబావులు దెబ్బ తింటున్నాయని అలాంటి మైనింగ్‌ను వెంటనే మూసివేయాలని లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆచారి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News