Monday, June 10, 2024

‘24/7.ఎఐ’లో మూడింట ఒక వంతు మహిళలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : హైదరాబాద్, బెంగుళూరులో కార్యాలయాలను కలిగి ఉన్న కస్టమర్ ఎంగేజ్‌మెంట్ సొల్యూషన్స్ సంస్థ [24]7.ఎఐ, జెండర్- ఇంక్లూజివ్ వర్క్‌ప్లేస్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది. కంపెనీ ఏడాదిలో 3,200 మంది మహిళా ఉద్యోగులను నియమించుకుంది. సంస్థ శ్రామికశక్తిలో మొత్తం మహిళల సంఖ్యను మూడింట ఒక వంతుకు తీసుకువెళ్లినట్లు ప్రకటించింది. మహిళలకు మార్గదర్శకత్వం, మద్దతు, బలమైన స్వరాన్ని సృష్టించడంపై దృష్టి సారించే అనధికారిక మహిళల నెట్‌వర్క్ ‘శక్తి ఎంపవర్’ని కూడా సంస్థ ప్రారంభించింది. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెచ్‌ఆర్‌డి హెడ్, ఇండియా అండ్ అమెరికాస్ నీనా నాయర్ మాట్లాడుతూ, 24/7.ఎఐ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News