Monday, May 6, 2024

పన్నీర్‌సెల్వంకు ఇసి షాక్

- Advertisement -
- Advertisement -

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా
పళనిస్వామి ఎన్నికకు ఆమోదం

చెన్నై: తమిళనాడులో ప్రధానప్రతిపక్షమైన అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కె పళనిస్వామి నియామకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం( ఇసి) ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ధ్రువీకరించింది. ఎన్నికల కమిషన్ పంపిన నోట్‌ను అన్నాడిఎంకె అధికార ప్రతినిధి ఆర్‌ఎం బాబు మురుగవేల్ గురువారం ట్వీట్ చేశారు. అన్నాడిఎంకె నియమ నిబంధనలకు చేసిన మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, ఆఫీస్ బేరర్ల నియామకానికి ఆమోదం తెలిపినట్లు ఇసి పేర్కొంది.

గత ఏడాది తనను పార్టీనుంచి బహిష్కరించడాన్ని, పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని సవాలు చేస్తూ పార్టీ బహిష్కృత నేత పన్నీర్‌సెల్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు బెంచ్ గురువారం విచారిస్తున్న సమయంలో ఇసి నిర్ణయం వెలువడడం గమనార్హం. జయలలిత మృతి తర్వాత అన్నాడిఎంకెపై పట్టు కోసం మాజీ ముఖ్యమంత్రులయిన పన్నీర్‌సెల్వం, పళనిస్వామిల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో 2022 జులై 11న పార్టీ జనరల్ కౌన్సిల్ చేసిన తీర్మానాలను, పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్నిక నిర్వహణను సవాలు చేస్తూ పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులు దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను మద్రాసు హైకోర్టు తిరస్కరించిన వెంటనే అప్పటివరకు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉండిన పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఇసి సైతం పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్ని ఆమోదించడంతో పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బ తగిలింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News