Friday, November 1, 2024

జె.డి. చక్రవర్తి చేతుల మీదుగా ‘అంతం కాదిది ఆరంభం’ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల

- Advertisement -
- Advertisement -

క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. పవర్ ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ ‌పోస్టర్‌ని టాలెంటెడ్ యాక్టర్ జె.డి. చక్రవర్తి ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టైటిల్ లుక్ పోస్టర్ అనంతరం జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ..‘‘టైటిల్ చూడగానే.. అరే ఇంత మంచి టైటిల్‌ని ఇప్పటి వరకు అంతా మిస్ అయ్యారేంటి? అని అనిపించింది.

అందుకే నిర్మాత సిరాజ్‌ని టైటిల్ రిజిస్టర్ చేయించారా? అని అడిగాను. ఒకవేళ చేయించకపోతే నేను కొట్టేసేవాడిని. కథలు కొట్టేయడం కామన్.. ఇవాళ సరైన టైటిల్ దొరకడం లేదు. ‘అంతం కాదిది ఆరంభం’ అనేది పాజిటివ్ అండ్ అద్భుతమైన టైటిల్. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ కృష్ణగారు సినిమా చేశారు. విజయనిర్మల‌గారు ఆ సినిమాకి డైరెక్టర్. హైదరాబాద్ సుదర్శన్ 70MMలో రిలీజైంది. ఏంటీ.. గూగుల్ చూసి చెబుతున్నానని అనుకుంటున్నారేమో.. కాదు.. నేనప్పుడు ఆ థియేటర్‌లో సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అలాగే.. అన్నం అంతా చూడక్కరలేదు.. అనే సామెతలా.. ఈ టైటిల్ చూస్తుంటే ఇది మంచి సినిమా అని ఖచ్చితంగా నమ్మవచ్చు. న్యూ టీమ్ అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి.. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News