Wednesday, May 15, 2024

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం నోటీసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రితో సహా వివిధ స్థాయిలో కర్ణాటక ప్రభుత్వంలో బిజెపి 40 శాతం అవినీతికి పాల్పడిందని వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన ప్రకటనలకు సంబంధిత ఆధారాలను ఇవ్వాలని ఆదేశిచింది.

ఆదివారం సాయంత్రం 7 గంటలలోపు కాంగ్రెస్ పార్టీ తన స్పందన వెల్లడించాలని కోరింది. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పార్టీలు ప్రచారాలను నిర్వహించుకోవాలని, సరైన ఆధారాలతోనే ప్రకటనలు ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేపై భజరంగదళ్ రూ.100 కోట్ల పరువు నష్ట పరిహారం దాఖాలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News