Friday, May 3, 2024

బెంగళూరు బస్సులో రాహుల్ ఎన్నికల ప్రచారం

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సోమవారం బెంగళూరులో బిఎంటిసి బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ సోమవారం ఉదయం బెంగళూరులోని కన్నింఘం రోడ్డు నుంచి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(బిఎంటిసి) బస్సులో ప్రయాణించారు. ధరల పెరుగుదల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ వరకు వివిధ అంశాలపై ఆయన ప్రయాణికులతో ముచ్చటించారు. ఉద్యోగాలకు, కాలేజీలకు వెళుతున్న మహిళలు, యువతులతో ఆయన ప్రధానంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Also Read: తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేత…

కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలోకి వస్తే మహిళలందరికీ కెఎస్‌ఆర్‌టిసి, బిఎంటిసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న తమ పార్టీ వాగ్దానాన్ని గురించి ఆయన వారికి తెలియచేశారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయాన్ని అందచేసే గృహలక్ష్మి పథకాన్ని గురించి కూడా ఆయన వారితో ముచ్చటించారు. లింగరాజపురంలో బస్సు దిగిపోయిన రాహుల్ అక్కడ బస్టాపులో నిలబడి ఉన్న ఉన్న ప్రయాణికులతో మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ మే 10న జరగనున్నది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రచార గడువు నేటి సాయంత్రంతో ముగియనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News