Tuesday, May 7, 2024

జలంధర్ ‘ఆప్’ వశం

- Advertisement -
- Advertisement -

జలంధర్ ‘ఆప్’ వశం
యూపిలో రెండు అసెంబ్లీ స్థానాలు బిజెపి మిత్రపక్షం కైవశం
జలంధర్ (పంజాబ్)/రాంపూర్ (యూపి): పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి, ఉత్తరప్రదేశ్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో ఒకటి, మేఘాలయలో ఒకటి అసెంబ్లీ స్థానాలకు ఈనెల 10న ఎన్నికలు జరగ్గా శనివారం ఫలితాలు వెలువడ్డా యి. పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానా న్ని ఆమ్‌ఆద్మీపార్టీ కైవసం చేసుకుంది. జలంధర్‌లో ఆప్ అభ్యర్థి సుషీల్ రింకు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కరంజిత్ కౌర్ చౌదురిపై 58,691 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ సుయర్ నియోజకవర్గానికి అధికార బీజేపీ మిత్ర పక్ష అప్నాదళ్ (ఎస్) అభ్యర్థి షఫీక్ అహ్మద్ అన్సారీ తన సమీప ఎస్‌పి అభ్యర్థి అనూరాధ చౌహాన్‌పై 8724 ఓట్ల తేడాతో గెలుపొందారు.

చాన్‌బే (ఎస్‌సి) స్థానానికి అప్నాదళ్ (ఎస్) రెండోసారి విజయం సాధించింది. రింకీకోల్ తన ప్రత్యర్థి ఎస్‌పికి చెందిన కీర్తికోల్‌పై 9587 ఓట్ల తేడాతో విజయం పొందారు. ఒడిశా లోని ఝార్సుగూడ అసెంబ్లీ స్థానంలో బిజెడి అభ్యర్థి దీపాళీ దాస్ తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన టాంకధర్ త్రిపాఠీపై 48,721ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మేఘాలయ తూర్పు ఖాసీహిల్స్ నియోజకవర్గంలో యుడిపికి చెందిన సిన్షార్ కుపార్ రాయ్ లింగ్‌ధో థాబా, ఎన్‌పిపి అభ్యర్థి సామ్లిన్ మాల్న్‌జియాంగ్‌పై 3422 ఓట్ల తేడాతో గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News